అద్బుతమైన ఉర్దూ సామెతలు..తెలుగు అర్దాలు

“సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు” అంటారు. నిత్య జీవితంలో ఉపయోగించే చాలా సామెతలకు ఫలానా వాళ్లు రాసారని ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు..పాపులర్ చేస్తారు. భాషా సాహిత్యంలోనూ, వాడుకలోనూ సమయానుకూలంగా, సందర్భానుసారంగా ఉపయోగించే సామెతలు ఆ సాహిత్యానికి అదనపు సొబగులు అద్దుతాయనటంలో సందేహం లేదు. మన తెలుగులో ఎన్నో సామెతలు ఉన్నట్లే ఉర్దూలోనూ అద్బుతమైన సామెతలుఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని చూద్దాం..వాటి అర్దం తెలుసుకుని ఆశ్వాదిద్దాం అంధా క్యా జానే బసంత్ బహార్ అంధుడుకేమి తెలుస్తుంది.. వసంత కాలంలో వచ్చే రంగుల అందాలు

అప్‌నీ గల్లీమే కుత్తా భీ షేర్ హోతా తమ వీధిలో ప్రతీ కుక్కా ..పులే

అప్నీ ఇజ్జత్ అప్నే హాత్ మే మీ గౌరవం మీ చేతుల్లోనే…

చిడియా ఉడ్‌జానే కే బాద్ పస్తాకే కే క్యా ఫాయిదా? పక్షులు ఎగిరిపోయినాక ఏడిస్తే ఏం లాభం?

అంధా క్యా చాహె దో ఆంఖే అంధుడుకి చూపు తప్ప వేరే ఏం కోరుకుంటాడు

ఆస్మాన్‌సే గిరా ఖజూర్ మే అట్కా అంత పెద్ద ఆకాశం దాటుకుని వచ్చింది కూడా ఒక్కోసారి చెట్టు కొమ్మల్లో ఇరుక్కుంటుంది

ఆధా తీతర్ ఆధా బీతర్ సగం తిత్తర..సగం బిత్తర

ఆంఖ్‌కా అంధా లేకిన్ నావ్‌ు నయన్‌సుఖ్ పుట్టు గుడ్డి.. పేరు మాత్రం విశాలాక్షి.

జిత్నా మూ ఉత్నీబాత్ చోటా మూ ఔర్ బడీ బాత్

పెద్ద వాళ్ల నుంచి చిన్న మాటలు, చిన్న వాళ్ల నుంచి పెద్ద మాటలు వినలేం

హాత్ కీ కంగన్ కో అయినా క్యోం ముంజేతి కంకణానికి అద్దం అవసరమా? దాల్ మే కాలా

ఎక్కడో ఏదో తేడా కొట్టేసింది

జల్తీ పర్ నమక్ చిడ్‌ఖానా పుండు మీద కారం చల్లినట్లు

జైసా దేస్ వైసా భేస్ రోమ్ లో ఉన్నప్పుడు రమన్ లాగ ఉండాల్సిందే

కర్ బురాతో హోయ్ బురా చెరపకురా చెడేవు

జో గరజ్‌తేహై వో బరస్‌తే నహీఁ వట్టి గొడ్డుకు అరుపులెక్కువ

డూబ్ తే కో టింకే కా సహారా వరదలో కొట్టుక పోయే వాడు ఆసరాగా గడ్డిపోచా ఆసరానే

జైసీ రాజా వైసీ ప్రజా యథా రాజా తథా ప్రజ.

లోహా లోహెకో కాట్తా హై వజ్రం వజ్రాన్నే కోస్తుంది.

జాన్ హై తో జహాన్ హై బతికుంటే బలుసాకైనా తిని బతుకొచ్చు

ఊఁట్ కే మూమే జీరే కా దానా బర్రెలను తినే వాడికి గొర్రెలు ఏ మూలకు

ఊఁచీ దుఖాన్ పీకా పక్వాన్ పేరు గొప్ప ఊరు దిబ్బ

ఏక్ మియీన్ మే దో తల్వార్ ఒక వొరలో రెండు కత్తులు కష్టం

ఏక్ హాత్ సే తాలీ నహీఁ బజ్తీ రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు

ఆప్ బలేతో జగ్ బలా నోరు మంచిదైతే ఊరుమంచిది.

అప్నీ తోషా అప్నా భరోసా మీ స్వశక్తి, మీ భరోసా

ఆజ్ కాసాగ్ కల్‌కా ముర్గీ సే బెహతర్ రేపటి కోడికూర కన్న ఇవాల్టి ఆకు కూర మేలు.

ఖూన్ కా బద్లా ఖూన్ కంటికి కన్ను పంటికి పన్ను, రక్తానికి రక్తం

చోరీ కా చీజ్ బడా హీ మజేదార్ దొంగ ముద్దుకు తీపి ఎక్కువ.

బే ఖూఫ్ దోస్త్ సే అకల్‌మంద్ దుష్మన్ అచ్చాహై తెలివి తక్కువ స్నేహితుడి కన్నా తెలివైన శత్రువు మంచిది

పూరా నహీఁతో ఆదా హీ సహీఁ గుడ్డి కంటే మెల్ల మేలు

మేనత్ హీ సబసే బడీ దౌలత్ హై శ్రమే ధనం